జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంతో రుజువైంది..
ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య
నవతెలంగాణ – ఆలేరు
జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అక్కడి ప్రజలు కాంగ్రెస్ కు ఘన విజయం అందించడం ద్వారా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనకు మద్దతు తెలిపారని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో యాదగిరిగుట్ట పట్టణంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. బిఆర్ఎస్ నాయకుడు. కేటీఆర్ ఎన్నికల సందర్భంగా రేవంత్ రెడ్డి పాలనకు రెఫరండం అన్నారు. జూబ్లీహిల్స్ ప్రజలు అతని చెంప చెల్లుమనిపించారని బిఆర్ఎస్ కొద్ది రోజుల్లో కనుమరుగు అవుతుందన్నారు.
కేటీఆర్ సొంత సోషల్ మీడియా ద్వారా కాంగ్రెస్ పార్టీపై ఎన్ని ఆరోపణలు గుప్పించిన ప్రజలు నమ్మలేదు అన్నారు. తల్లి సోనియా గాంధీ మిగులు బడ్జెట్ తో రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి ఇస్తే గత పది ఏళ్ల బి ఆర్ ఎస్ పాలనలో తండ్రి కొడుకు అల్లుడు రాష్ట్రాన్ని దోచుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ 23 మాసాల ప్రజాపాలన లో పేదవాడికి ఇందిరమ్మ ఇండ్లు సన్న బియ్యం రేషన్ కార్డులు 200 యూనిట్ల లోపు ఉచిత కరెంటు మహిళకు ఉచిత బస్సు నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇచ్చిందన్నారు. మొన్న కంటోన్మెంట్లో గెలిచాము నేడు జూబ్లీలో గెలిచాము. రాబోయే కాలంలో స్థానిక సంస్థలన్నీ ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుందన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారానికి ఆలేరు నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రచారానికి వెళ్లిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. జూబ్లీహిల్స్ ప్రజలకు ధన్యవాదాలు చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఆలేరు మండల పార్టీ అధ్యక్షుడు వెంకటేశ్వరరాజు, మంగ సత్యనారాయణ కాంగ్రెస్ నాయకులు గుల్లపల్లి భరత్ ఎరుకల హిమేందర్ ముక్కెర్ల మల్లేష్ వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు.



