Friday, November 14, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సెంటిమెంట్తో గెలవాలనుకుంటే చెంపపెట్టు తీర్పు ఇచ్చారు 

సెంటిమెంట్తో గెలవాలనుకుంటే చెంపపెట్టు తీర్పు ఇచ్చారు 

- Advertisement -

చైర్ పర్సన్ జ్యోతి అల్వాల్ రెడ్డి 
నవతెలంగాణ – మిడ్జిల్ 

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ సెంటిమెంట్ రగిలించి ఉప ఎన్నికల్లో గెలవాలని కుట్రలు, కుతంత్రాలకు తెరలేపిన, ప్రజలు అభివృద్ధి చేస్తున్న ప్రజా ప్రభుత్వమైనా కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీతో నవీన్ యాదవ్ ను జూబ్లీహిల్స్ ప్రజలు గెలిపించారని బాదేపల్లి మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ జ్యోతి అల్వాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని వాడియాల్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అల్వాల్ రెడ్డి స్వగృహంలో మాజీ జెడ్పిటిసి గౌసి రబ్బాని, మాజీ సర్పంచులు వెంకటేష్ గౌడ్ కంచనపల్లి నరసింహతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పది సంవత్సరాలు అధికారంలో ఉన్న బి ఆర్ ఎస్ ప్రభుత్వం  ప్రజలను పట్టించుకోనందుకే కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని అన్నారు. ఉప ఎన్నికలలో గెలుపొందిన నవీన్ యాదవ్ కు మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యేగా పదవి బాధ్యతలు చేపట్టినంక ప్రజల సమస్యల కోసం నిరంతరం పనిచేయాలని కోరారు. విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు ఎడ్ల శంకర్, నరేందర్ రెడ్డి, మున్ననూరు వెంకటయ్య, నాగయ్య, అశోక్, తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -