- Advertisement -
కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి
నవతెలంగాణ – ఆమనగల్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు చారిత్రాత్మకమైన గెలుపని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన నవతెలంగాణ తో మాట్లాడారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో నవీన్ యాదవ్ గెలుపుకు సహకరించిన నియోజకవర్గం పార్టీ శ్రేణులకు ఆయన పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు. బీఆర్ఎస్ తప్పుడు ప్రచారానికి, అనంతమైన అబద్ధాలకు ప్రజలు చెప్పిన గుణపాఠం అన్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రెండేళ్లుగా రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రజా పాలనకు ఈ ఉప ఎన్నిక రెఫరెండం లాంటిదని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
- Advertisement -



