దేశభక్తిని చాటిన చిన్నారులు..
నవతెలంగాణ – తిమ్మాజిపేట
మండలంలోని అవంచ గ్రామంలో ఉన్న జడ్ పి హెచ్ ఎస్ పాఠశాలలో బాలల దినోత్సవాన్ని శుక్రవారం విద్యార్థులు, ఉపాధ్యాయులు ఘనంగా నిర్వహించారు. దేశ నిర్మాత తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా నిర్వహించిన ఈ వేడుకలు కన్నుల పండుగగా సాగాయి. ప్రధానోపాధ్యాయులు అమృత ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో చిన్నారులకు క్విజ్, వ్యాసరచన, చిత్రాలేఖనం, పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు అమృత మాట్లాడుతూ బాలలే భావి భారత పౌరులు. రేపటి తరాలకు భారతదేశానికి పట్టుకొమ్మలు. నేటి బాలలే దేశాన్ని నడిపించడంలో ముందుంటరాని తెలిపారు. దేశ చరిత్ర తరగతి గదిలో బాలలతోనే నిర్మితమవుతుందని ఆమే పేర్కొన్నారు. చిన్నప్పటి నుంచే బాలలలో దేశభక్తి విలువలను పెంపొందించడానికి ఉపాధ్యాయులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు, సమాజం కూడా కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఘనంగా బాలల దినోత్సవం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



