నవతెలంగాణ- చండూరు: స్థానిక సన్ షైన్ పాఠశాలలో చాచా నెహ్రూ జయంతిని పురస్కరించుకుని బాలల దినోత్సవాన్ని మంగళవారం నెహ్రూ చిత్ర పటానికి పూల మాలతో నివాళులు అర్పించి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ కోడి వెంకన్న మాట్లాడుతూ నెహ్రూ గారు బాలల కోసం తన అమూల్యమైన సమయాన్ని కేటాయించే వారని అదేవిధంగా ప్రస్తుత పరిస్థితుల్లో తల్లిదండ్రులు వారి పిల్లలతో కొంత సమయాన్ని గడపాలని, విద్యార్థినీ విద్యార్థులు సెల్ ఫోన్ వాడకాన్ని తగ్గించి తల్లిదండ్రులతో కలిసి ఆనందంగా ఉండాలని అన్నారు. బాలల దినోత్సవం సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులు స్వాతంత్ర సమరయోదుల, భరత మాతా, సైనిక వేషధారనలతో, సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ కోడి సుష్మా, ప్రిన్సిపల్ రవికాంత్, లతీఫ్ పాషా, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.