Sunday, May 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మానవత్వాన్ని చాటుకున్న లెంకలపల్లి క్రికెట్ టీం 

మానవత్వాన్ని చాటుకున్న లెంకలపల్లి క్రికెట్ టీం 

- Advertisement -

నవతెలంగాణ-మర్రిగూడ 
మండలంలోని లెంకలపల్లి గ్రామానికి చెందిన క్రికెట్ టీం సభ్యులు మానవత్వాన్ని చాటుకున్నారు.ఇటీవల లెంకలపల్లి గ్రామంలో ఈ ఎల్ వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ లో లెంకలపల్లి క్రికెట్ టీం రన్నర్ రప్ గా నిలిచి ద్వితీయ బహుమతి 25,116 రూపాయల ప్రైజ్ మనీని గెలుచుకుంది.గెలుచుకున్న ఆ ప్రైజ్ మనీ 25116 రూపాయలను అదే గ్రామానికి చెందిన గ్రామపంచాయితీ సిబ్బంది గుండెపూరి నరసింహా భార్య లక్ష్మి అనారోగ్యంతో బాధపడుతుందన్న విషయాన్ని తెలుసుకొని క్రికెట్ టీం సభ్యులు,టోర్నమెంట్ ఆర్గనైజర్లు ఆదివారం ఈఎల్వి ఫౌండేషన్ మర్రిగూడ మండల ఇన్చార్జ్ అయితగోని నరసింహా ఆధ్వర్యంలో బాధితురాలికి అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో భాగంగా ఆర్గనైజర్స్ చాపల శ్రీకాంత్,పగిళ్ల అశోక్,పాక కిరణ్,మానుపాటి సతీష్,కొలుగూరి వెంకటేష్,అయితగోని భిక్షం,తిప్పర్తి శ్రీరాములు,రేణుకుంట్ల నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -