Sunday, May 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అగ్ని ప్రమాద బాధితులకు పాఠశాల తరఫున ఆర్థిక సహాయం

అగ్ని ప్రమాద బాధితులకు పాఠశాల తరఫున ఆర్థిక సహాయం

- Advertisement -

నవతెలంగాణ – పెద్దవూర
నల్గొండ పెద్దవూర మండలం పోతునూరు గ్రామానికి చెందిన బొడ్డు కిరణ్ ఇల్లు ఇటీవల విద్యత్ షార్టు సర్క్యూట్ తో దగ్ధం అయింది. ఇందులో భాగంగా బాధిత కుటుంబానికి పోతునూరు ప్రాథమీకోన్నత పాఠశాల ఉపాధ్యాయునీ ఉపాధ్యాయులు, ప్రాధానో పాధ్యాయులు వెంకట్రామ్ నాయక్ ఆధ్వర్యంలో ఆదివారం రూ.5000 నగదు, మూడు వేల విలువైన నిత్యవసర సరుకులు అందిజేశారు. ఈ సందర్బంగా ప్రాధానోపాధ్యాయులు మాట్లాడుతూ.. అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన బొడ్డు కిరణ్ కుమార్ కుటుంబానికి సానుభూతిని వ్యక్తం చేస్తూన్నామని, ఆపదలో ఉన్నవారికి మానవతా దృక్పథంతో సహాయం అందించాలని కోరారు. వారికి చేదుడు వాదోడుగా నిలబడి ధైర్యం నింపాలని చుట్టుపక్కల కుటుంబాల వారికి, సన్నిహితులకు, బంధుమిత్రులకు తెలియజేశారు. మా పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న చిన్నారులు బొడ్డు సంజయ్, బొడ్డు లాస్మిక కుటుంబానికి పాఠశాలతరుపున ఆర్థిక సహాయం అందజేశామని తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రామ్మూర్తి, మెహజాబి, అంజాద్, బీబీలత, ధర్మారెడ్డి, సైదమ్మ తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -