- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండలంలోని కంఠాలి గ్రామంలో ఆర్ అండ్ బి రోడ్డు బస్ స్టాప్ దగ్గర ఒక గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పదంగా సంచరిస్తున్నాడు. ఈ క్రమంలో గ్రామ యువకులు ఆయన్ని పలు ప్రశ్నలు అడిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆయనతో మాట్లాడితే పొంతన లేని సమాధానాలు ఇస్తున్నాడని, తిక్క తిక్కగా మాట్లాడుతున్నాడని తెలిపారు. వ్యక్తి ఆయోమయంగా, వింతగా ప్రవర్తిస్తున్నాడని అన్నారు. ప్రస్తుతం గ్రామంలోని వీధిలో తిరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గ్రామ పెద్దలు సూచిస్తున్నారు. ఎవరైనా గుర్తిస్తే అనుమానాసద వ్యక్తి కుటుంబీకులు వచ్చి తీసుకువెళ్లాలని చెప్పారు. వెంటనే పోలీసులకు సమాచారం అందిస్తామని వారు స్పష్టం చేశారు.
- Advertisement -



