ఆర్టీఐ ద్వారా సమాచారం కోరిన..జిల్లా కార్యవర్గ సభ్యురాలు సుప్రియ
నవతెలంగాణ – మల్హర్ రావు
భూపాలపల్లి జిల్లాలోని మహిళా శిశు సంక్షేమ శాఖలో నకిలీ ధ్రువపత్రాలను సమర్పించి ఉద్యోగాలు పొందిన వారి పూర్తి సమాచారం అందించాలని సంబంధించిన అధికారులను ఆర్టీఐ జిల్లా కార్యవర్గ సభ్యురాలు పులిగంటి సుప్రియ సూచించారు. ఈ మేరకు ఆమె సమాచార హక్కు చట్టం 2005 ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నకిలీ ధ్రువపత్రాలపై ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై సమగ్ర విచారణ చేపడతామని పేర్కొన్నారు.
అక్రమంగా ఉద్యోగం పొందినట్లు నిర్ధారణ అయితే సంబంధిత వ్యక్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. నియామక సమయంలో సమర్పించిన ధ్రువపత్రాలు, వాటి పరిశీలన ప్రక్రియ, విద్యార్హతలు, నియామక ఉత్తర్వులు తదితర అంశాలను అధికారులు పూర్తిగా పరిశీలించాలని, విచారణ పూర్తయ్యే వరకు ఎలాంటి వ్యక్తిగత ఆరోపణలను నిజాలుగా పరిగణించకుండా, అధికారిక రికార్డుల ఆధారంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆర్టీఐ చట్టం–2005 కింద కోరిన సమాచారాన్ని పారదర్శకంగా అందించి, ఈ వ్యవహారంపై సమగ్ర విచారణకు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నామని సుప్రియ తెలిపారు.



