- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : దుబాయ్‌లోని ఓ కార్ల షోరూమ్‌లో బుధవారం గ్యాస్ సిలిండర్ పేలి కేరళకు చెందిన షిజిన్ పాల్ (27) అనే భారతీయుడు మృతి చెందాడు. షోరూమ్‌లో మంటలు చెలరేగడంతో సిబ్బంది బయటకు పరుగులు తీశారు. మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తుండగా భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో షిజిన్‌తో పాటు మరో ఐదుగురు గాయపడ్డారు. భారత రాయబార కార్యాలయం మృతుడి కుటుంబసభ్యులతో సంప్రదింపులు జరుపుతోంది. కొల్లాం జిల్లాకు చెందిన షిజిన్ పాల్ గత నవంబర్‌లో దుబాయ్‌కి వెళ్లి కారు షోరూమ్‌లో మార్కెటింగ్ స్పెషలిస్టుగా చేరాడు.
- Advertisement -



