- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ట్రంప్ హెలికాప్టర్ ప్రయాణికుల విమానానికి అతిసమీపంగా వెళ్లగా, ముప్పు తప్పడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. వాషింగ్టన్ గగనతలంలో డొనాల్డ్ ట్రంప్‌ను తీసుకువెళ్తున్న సైనిక హెలికాప్టర్ మెరైన్ వన్ ఓ ప్రయాణికుల విమానానికి అతిసమీపంగా వచ్చిందా, లేదా అనే దానిపై అమెరికా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే, అధ్యక్షుడికి ఎటువంటి ప్రమాదం లేదని వైట్ హౌస్ స్పష్టంచేసింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లతో సమాచార మార్పిడి సరిగ్గా జరగకపోవడమే దీనికి కారణమంటున్నారు అధికారులు.
- Advertisement -



