Sunday, November 16, 2025
E-PAPER
HomeNewsఛత్తీస్‌గఢ్ అడవుల్లో ఎన్‌కౌంట‌ర్..ముగ్గురు మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గఢ్ అడవుల్లో ఎన్‌కౌంట‌ర్..ముగ్గురు మావోయిస్టులు మృతి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఛత్తీస్‌గఢ్ అడవుల్లో ప‌లు రోజ‌లుగా ఎన్‌కౌంట‌ర్లు జ‌రుగుతున్నాయి. ఆప‌రేష‌న్ క‌గార్ పేరుతో భ‌ద్ర‌తా ద‌ళాల కాల్పుల‌తో మావోయిష్టులు చ‌నిపోతున్నారు. తాజాగా ఆదివారం తెల్లవారుజామున సుక్మా జిల్లా చింతగుఫా పోలీస్ స్టేషన్ పరిధిలోని కరి గుండం అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టుల‌కు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి.ఈ ఎన్ కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలం నుంచి ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, తుమల్‌పాడ్ ఎన్‌కౌంటర్ సైట్‌లో ఇద్దరు మహిళా మావోయిస్టులతో సహా మొత్తం ముగ్గురు మావోయిస్టు కేడర్ నేతలు మరణించినట్లు పోలీసులు నిర్ధారించారు.

వారిని మాద్వి దేవా – జన్మిలిటియా కమాండర్, స్నిపర్ స్పెషలిస్ట్, కొంటా ఏరియా కమిటీ సభ్యురాలు కాగా ఆమెపై రివార్డ్ మొత్తం ₹5 లక్షల రివార్డు ఉంది. పోడియం గంగి – కొంటా ఏరియా కమిటీ CNM కమాండర్ కాగా.. అతనిపై మొత్తం ₹5 లక్షల రివార్డు ఉంది. అలాగే సోడి గంగి – కిస్తారామ్ ఏరియా కమిటీ సభ్యులు. ఇతనిపై మొత్తం ₹5 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -