Monday, November 17, 2025
E-PAPER
Homeదర్వాజకవనోదయ కాంతి పాటై..!

కవనోదయ కాంతి పాటై..!

- Advertisement -

అక్షర జీవ నదులకు
పల్లె పలుకులతో ప్రాణం పోసి
జానపద జవసత్వాన్ని నింపి ప్రపంచ పటంపై
మట్టి పాటల కలలను పారించారు..!
పనైపోయిందనీ.. అవనిపై మౌన మునిలా
అందెశ్రీ అస్తమించారు…!
కాలం గుండెను చీల్చుతూ,
మట్టి కిరణాల ప్రవాహమై
మన గుండెల్లో
కవనోదయ కాంతి పాటై
ప్రతిధ్వనిస్తున్నారు..!
తెలంగాణ భావాల
ఉద్యమ గొంతుకై నిలిచి
మానవత జాడకై
నిప్పుల వాగును సష్టించి
పద్యాల అందెల సందడిని ఆవిష్కరించి
తెలంగాణ జాతి గీత జయకేతనమయ్యారు..!
బతుకు యుద్ధ సుడిగుడంలో
చైతన్య శిఖరమై
ఆధ్యాత్మిక రేడియేషన్‌ బడిలో బాసర సరస్వతి
చదువుల గాలులు నింపేసి
సగటు మనిషి సమస్యల కొమ్మలకు
కొంగొత్త రాగాలను విరచించి
ప్రకతి ఉదయ వనంలో ప్రాణ పాలవెల్లిగా…
అందెశ్రీ పాటల పూదోట
తరతరాల స్ఫూర్తి తోవలో
కవన భవన ప్రేరణ బాట..!

ఫిజిక్స్‌ అరుణ్‌ కుమార్‌ , 9394749536

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -