సాహితీ వార్తలు

‘లోయ చివరి రహస్యం’ ఆవిష్కరణ
బోధి ఫౌండేషన్‌, తెలంగాణ భాషా సాంస్కతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో భగవంతం కథా సంపుటి ‘లోయ చివరి రహస్యం’ ఆవిష్కరణ సభ ఫిబ్రవరి 3వ తేదీ సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌, రవీంద్రభారతి కాన్ఫరెన్స్‌ హాల్‌లో జరుగుతుంది. ఈ సభకు డా||కె.శ్రీనివాస్‌, డా||ఎస్‌.రఘు, కిల్లాడ సత్యనారాయణ, వి.హర్షవర్ధన్‌, సిద్ధార్థ, నండూరి రాజగోపాల్‌, ఇండ్ల చంద్రశేఖర్‌ హాజరవుతారు.
‘లోపలి ముసురు’ పుస్తక ఆవిష్కరణ
దక్కన్‌ సాహిత్య సభ ఆధ్వర్యంలో భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ ప్రభుత్వం సౌజన్యంతో అరుణ నారదభట్ల కవిత్వం ‘లోపలి ముసురు’ పుస్తక ఆవిష్కరణ సభ ఫిబ్రవరి 4వ తేదీ సాయంత్రం 6.15 నిమిషాలకు హైదరాబాద్‌ రవీంద్రభారతి మినీహాల్లో జరుగుతుంది. ఈ సభలో డా||ఎన్‌.గోపి, డా||ఏనుగు నరసింహారెడ్డి, డా||మామిడి హరికృష్ణ, డా||యాకూబ్‌, డా||ఎస్‌.రఘు, మెర్సీ మార్గరెట్‌ పాల్గొంటారు.
ఎలనాగకు ఉకియోటో అవార్డు
ఎలనాగ రచించిన ఆంగ్ల కవితల సంపుటి, Dazzlers కు, ఉకియోటో అనే గ్లోబల్‌ ప్రచురణ సంస్థPoet of the Year 2023 అవార్డును ప్రకటించింది. 2024 జనవరి 12, 13, 14 తేదీలలో కలకత్తాలో జరిగిన Kolkata Literary Carnival (కలకత్తా సాహిత్య సమారోహం) లో 13 వ తేదీన ఎలనాగ ఈ పురస్కారాన్ని స్వీకరించారు. ఉకియోటో సంస్థ ఈ అవార్డును ఇవ్వటమే కాకుండా, ణaఓఓశ్రీవతీర ను టర్కిష్‌, ఫ్రెంచ్‌, జర్మన్‌, స్పానిష్‌, రష్యన్‌, చైనీస్‌, జపనీస్‌ భాషలలోకి అనువదింపజేసింది.
పద్య శతకాలకై ఆహ్వానం
శత శతక సుధానిధి పేరుతో వంద శతకాలను సమీక్షల ద్వారా పరిచయం చేస్తూ ఒక గ్రంథాన్ని వెలువరించాలని భవానీ సాహిత్య వేదిక కరీంనగర్‌ సంస్థ నిర్ణయించింది. ఈ సందర్భంగా శతకాలు రచించిన కవులు తమ శతకాలను సమీక్షించుటకు ఎలాంటి అభ్యంతరం లేదనే హామీపత్రంతో పాటు మీ శతకాలు రెండు పుస్తకాలను జనవరి 31 లోపు డా.వైరాగ్యం ప్రభాకర్‌ ఇంటి నెంబర్‌ 2-102 సీతారాంపూర్‌ కరీంనగర్‌, తెలంగాణ 505001 చరవాణి: 9014559059 పంపగలరు.
ఫిబ్రవరి 4న వర్తన ప్రారంభ సమావేశం
సాహిత్యరంగంలో నవీన ధోరణులు పాదు కొల్పాలన్న లక్ష్యంతో ఏర్పాటయిన వర్తన సాహిత్య సంస్థ ఆధ్వర్యంలో ప్రారంభ సమావేశం ఫిబ్రవరి 4వ తేదీ ఉదయం 10.30 గంటలకు రవీంద్రభారతి సమావేశ మందిరంలో జరుగుతుంది. ఈ సమావేశంలో ‘కవిత్వం – శిల్పం’ అనే అంశంపై చర్చ వుంటుంది. ఈ సమావేశానికి ఎం.నారాయణ శర్మ, గుడిపాటి ఒద్దిరాజు ప్రవీణ్‌కుమార్‌ హాజరవుతారు. కవులు, రచయితలు, సాహిత్యాభిమానులు అందరూ ఆహ్వానితులే.
– ఒద్దిరాజు ప్రవీణ్‌ కుమార్‌

Spread the love