నవతెలంగాణ-హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా కోహెడ అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్ నిర్మాణ పనులకు శనివారం సాయంత్రం సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు.రాష్ట్రంలో ప్రస్తుతం 206 వ్యవసాయ మార్కెట్ కమిటీలు, 79 ఉప మార్కెట్ యార్డులు పనిచేస్తున్నాయని మంత్రి తుమ్మల తెలిపారు. వీటి ద్వారా ఏటా సుమారు రూ.80 వేల కోట్ల విలువైన వ్యవసాయ వాణిజ్య కార్యకలాపాలు జరుగుతున్నాయని వెల్లడించారు. ఆ తర్వాత జరిగే భారీ బహిరంగ సభకు హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, రంగారెడ్డి సహా నల్లగొండ, మహబూబ్‌నగర్ వంటి సరిహద్దు జిల్లాల నుంచి 50 వేల మందిని తరలించనున్నారు.
నేడు కోహెడ్ పండ్ల మార్కెట్ నిర్మాణ పనులకు సీఎం శంకుస్థాపన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



