Saturday, June 6, 2026
E-PAPER
Homeజాతీయంజంత‌ర్ మంత‌ర్‌లో నేడు ‘కాక్రోచ్’ నిర‌స‌న‌

జంత‌ర్ మంత‌ర్‌లో నేడు ‘కాక్రోచ్’ నిర‌స‌న‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: కాక్రొచ్ జ‌న‌తా పార్టీ(సీజేపీ) శ‌నివారం ఢిల్లీలో నిర‌స‌న‌ ప్ర‌ద‌ర్శ‌న‌కు సిద్ధమైంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధ‌ర్మేంద‌ర్‌ ప్ర‌ధాన్ రాజీనామా చేయాల‌న్న డిమాండ్‌తో జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌కు సీజేపీ పిలుపునిచ్చింది. ఉద‌యం 9గంట‌ల‌కు నిర‌స‌న తెలిపేందుకు జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద స‌మావేశ‌మ‌వుతున్న‌ట్లు శుక్ర‌వారం ఎక్స్ వేదిక‌గా సీజేపీ పేర్కొంది. త‌మ‌ది శాంతియు ప్ర‌ద‌ర్శ‌న‌గా అభివ‌ర్ణ‌స్తూ ఈ నిర‌స‌న‌లో పాలుపంచుకోవాల‌ని త‌న మ‌ద్ద‌తుదారుల‌ను కోరింది. కాగా, సీజేపీ వ్య‌వ‌స్థాప‌కుడు అభిజీత్ దీప్కే శ‌నివారం ఉద‌యం బోస్ట‌న్ నుంచి ఢిల్లీకి రానున్నారు. ప‌ర్యావ‌ర‌ణ కార్య‌క‌ర్త సోన‌మ్ వాంగ్‌చుక్ ఆయ‌న‌కు స్వాగ‌తం ప‌లుక‌నున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -