Friday, September 11, 2026
E-PAPER
Homeదర్వాజఏటుకూరికి అరుణాంజలి

ఏటుకూరికి అరుణాంజలి

- Advertisement -

ఇదే ఎర్ర బాటరా, ఇదే ఎర్ర పాటరా, శృమజీవుల రక్తంతో ఎరుపెక్కిన బాటరా` అనే ఈ పాట ప్రతి కమ్యూనిస్టు సభలలోనూ మారుమోగిన గీతం ఇది. అభ్యుదయ సాహిత్య ఉద్యమం, ప్రజానాట్య మండలి కలిసి నిర్మించిన సాంస్కృతికోద్యమం నుండి వెలువడ్డ పాటలివి. ఎర్ర జెండా పాటను ఎదను నింపుకుని ఎదిగిన సాంస్కృతిక జీవి ఏటుకూరు ప్రసాద్. అతనొక ఉద్యమ సాహితీకారుడు. జీవితపు చివరికంటా నిబద్ధంగా బతికిన అభ్యుదయవాది. ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో అభ్యుదయ సాహిత్యోద్యమ వారసత్వాన్ని కొనసాగించారు. శ్రీశ్రీ కవిత్వాన్ని చదివి ప్రేరణ పొంది సాహిత్యకృషిని కొనసాగించారు. ప్రూఫ్ రీడర్ గా తన పత్రికావృత్తిని ప్రారంభించి, ఎన్నో పత్రికలకు సంపాదక బాధ్యతలు చేపట్టారు. 1960 తర్వాత హైదాబాద్ కు మకాం మార్చిన తర్వాత తెలుగు అధ్యాపకులుగా పనిచేశారు. అరసం జాతీయ కార్యదర్శిగానూ పనిచేశారు. 'అభ్యదయ' సాహిత్య మాస పత్రికకు సంపాదకులుగా నవల, వాడుకభాష విమర్శ, కవిత్వంపై విశేష సంచికలు తెచ్చారు. 'తాపీ ధర్మారావు జీవితం - రచనలు అనే అంశంపై చేసిన పరిశోధనకు ఉప్మానియా విశ్వవిద్యాలయ౦ డాక్టరేట్ ప్రధానం చేసింది. అనేక సాహితీ సభలు నిర్వహించడంలో విశేష కృషి చేశారు. 1862- 1962 మధ్యకాలంలో పుట్టిన కవుల స్వదస్తూరితో రాసిన కవితలను ‘పొయెట్రీ వర్కషాప్` అనే పేరున ప్రసాద్ గారు ప్రచురించిన పుస్తకం ప్రసిద్ధమైనదిగా నిలిచింది. నవచేతన, విశాలాంధ్ర పుస్తకాలయాలకు సంపాదకులుగా అనేక సాహిత్య గ్రంధాలను ప్రచురిణచారు. విస్తృతంగా ఎర్రజెండా పాటలు రాసిన రచయితగా ప్రసిద్ధులయిన ఏటుకూరు తన 91 వయసులో మే 23న అనారోగ్యంతో మరణించారు. కానీ అతని పాట మోగుతూనే ఉంటుంది. వారికివే అరుణాంజలులు.
కె. ఆనందాచారి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -