పేర్చుకున్న కలల వంతెనలు కూల్చి వేయబడుతున్న వేళ
నేర్చుకున్న లేలేత అక్షరాలు నెత్తురోడుతున్న వేళ
రక్తపుటేరులు పారించిన దేశభక్త లాఠీలకు
నెత్తుటి గాయాలతో ఎర్ర గులాబీలను బహూకరిస్తున్నాయి
ఈ నేలన రెక్కవిప్పిన రింగన పురుగులు
ఎన్ని చీకటి గుహలను ఈదుతూ ఒక్కటయ్యినాయో
ఈ మిణుగురు మెరుపులు
ఎన్ని యుగాల ఆశలను, ఆశయాలను మూటగట్టుకుని
ఎంత దుఃఖపు మబ్బును నెత్తి కెత్తుకుని
దీర్ఘయాత్రకు బయలు దేరినాయో ఈ చిట్టి చీమలు
ఎన్ని తరాల సింహనాద స్వరాలను ఆవాహించుకున్నాయో
ఈ మృదు కోయిల కూనలు
అధర్మ ప్రధానాలపై ధర్మయుద్ద నినాదాలైన
పూర్ణ స్వరాజ్య కొత్తదారులు
మట్టిబిడ్డల పుట్టుకను ప్రశ్నించే
పరదేశి పట్టు పరదాలు కప్పుకున్న
స్వాములకు ఒక హెచ్చరిక
ప్రశ్నను సహించలేని పాలకులకు
పల్లె పొలిమేరలనుండి ఢిల్లీ పార్లమెంటు దాకా సవాళ్ల కవాతు
నేడు కాకపోతే రేపు సమాధానాలు సిద్ధం చేసుకోండి
ఈ నేల మేల్కొనే ఉన్నది, వేల వేల కన్నులతో
వెన్నెల వెలుగులకోసం వేచి చూస్తున్నది
మెరుపు అలల సంకేతాలను డీకోడ్ చేస్తున్న
ఆర్గానిక్ పురుగుల దండుకు సలాం
భరతమాత నుదుట రక్తతిలకం దిద్దుతున్న
‘యువతరమా నవతరమా
ఈ దేశపు కండ్లు మీరే కాళ్ళుమీరే…’
గాజుల శ్రీధర్,9849719609
ఆర్గానిక్ పురుగుల దండుకు సలాం
- Advertisement -
- Advertisement -



