Sunday, September 6, 2026
E-PAPER
Homeదర్వాజక్షితిజ రేఖ

క్షితిజ రేఖ

- Advertisement -


దిగంతాల దాకా సాగే ఈ పరుగులో
నీ అడుగుల చప్పుడు ఎప్పుడైనా వినగలిగావా?
వెన్నెల చల్లదనాన్ని, సూర్యుని వెచ్చదనాన్ని
శ్వాసలో నింపుకోవాలని తమలోని అలజడులెన్నడైనా సరిచూశావా?
కనురెప్పల చాటున దాచిన
రూపుదిద్దుకుంటున్న కలల ఆరాటం
తూనిగల రెక్కల మీద రంగులు కాపు!
స్వేచ్ఛగా సాగే గాలి, పాదాల కింద మెల్లగా నలిగే మట్టి
ఇక ఇప్పుడు అవి అనుభవాలు మాత్రమే కావు!
ఆకాశాల దారిలో ముందుకు నడిపించే దీపధారులు—
పడగలను కోసుకు నిలిపి నీలోకి తొంగి చూడు
నీవు వెతుకుతున్నదేదో అంతరంగంలోని
క్షితిజ రేఖపై దర్శనమిస్తుంది…
-డా. నామోజు బాలాచారి, 9063131999

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -