Sunday, September 6, 2026
E-PAPER
Homeతాజా వార్తలునందమూరి మోక్షజ్ఞ అరంగేట్రం ఖరారు..

నందమూరి మోక్షజ్ఞ అరంగేట్రం ఖరారు..

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌ : నందమూరి అభిమానులు, తెలుగు సినీ ప్రేక్షకులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న శుభ తరుణం రానేవచ్చింది. నటసింహం నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజ సినీ అరంగేట్రం అధికారికంగా ఖరారైంది. అతడి తొలి చిత్రానికి ‘బింబిసార’ వంటి బ్లాక్‌బస్టర్‌ను అందించిన యువ దర్శకుడు మల్లిడి వశిష్ట దర్శకత్వం వహించనున్నారు. టాలీవుడ్‌లోని అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రతిష్ఠాత్మక చిత్రాన్ని నిర్మించనుంది.

మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం ఈ భారీ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు మైత్రీ మూవీ మేకర్స్ తమ సోషల్ మీడియా ఖాతా ద్వారా ఒక ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ ఫొటోలో బాలకృష్ణ, మోక్షజ్ఞ, దర్శకుడు వశిష్ట ముగ్గురూ కలిసి కనిపించడంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

ఈ సందర్భంగా మేకర్స్ ఒక పవర్‌ఫుల్ క్యాప్షన్‌ను జోడించారు. “డెన్‌ను వదిలిన కూన ఇప్పుడు సింహంలా అడవిలోకి ఎంటర్ అయింది” అంటూ మోక్షజ్ఞ ఎంట్రీని అభివర్ణించారు. ఈ ప్రకటనతో నందమూరి అభిమానుల్లో పండుగ వాతావరణం నెలకొంది. కొన్నేళ్లుగా మోక్షజ్ఞ ఎంట్రీ గురించి జరుగుతున్న ఊహాగానాలకు ఈ ప్రకటనతో పూర్తిస్థాయిలో తెరపడినట్లయింది.

‘బింబిసార’ చిత్రంతో దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వశిష్ట, ఇప్పుడు నందమూరి వారసుడిని హీరోగా పరిచయం చేసే బాధ్యతను తీసుకోవడం ప్రాజెక్ట్‌పై అంచనాలను రెట్టింపు చేసింది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలతో పాటు, చిత్రీకరణ ఎప్పుడు ప్రారంభమవుతుందనే విషయాలను వెల్లడించనున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -