విశ్వక్ సేన్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘లెగసీ’ విడుదల తేదీ ఖరారైంది. ఇంటెన్స్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రం డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. సాయికిరణ్ రెడ్డి దైదా రచన, దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కలాహి మీడియా బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. యశ్వంత్ దగ్గుమాటి, సాయి కిరణ్ రెడ్డి దైదా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంజయ్ సాంబ్రాణి, వి.వి.ఎన్. ప్రసాద్ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. చిత్ర విడుదల తేదీని అధికారికంగా ప్రకటిస్తూ మేకర్స్ ఓ స్ట్రైకింగ్ రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేశారు. విశ్వక్ సేన్, ఏక్తా రాథోడ్ కనిపిస్తున్న ఈ కొత్త పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. పవర్‌ఫుల్ పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అధికారం, కుటుంబం, ప్రేమ, ద్రోహం వంటి అంశాల మధ్య జరిగే ఆసక్తికర సంఘర్షణను ఆవిష్కరించనున్నారు. తన తండ్రి వదిలిన వారసత్వం కారణంగా ప్రమాదకరమైన ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఓ యువకుడి ప్రయాణంలో విశ్వక్ సేన్ పాత్ర సాగుతుంది. ఈ చిత్రంలో హిందీ నటుడు కే కే మీనన్ అత్యంత శక్తివంతమైన ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో శరవేగంగా జరుగుతోంది అని చిత్రబృందం చెప్పింది.
‘లెగసీ’ రిలీజ్ డేట్ ఫిక్స్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



