Sunday, July 26, 2026
E-PAPER
Homeదర్వాజ'అయ్యో'ధ్య… రామ

‘అయ్యో’ధ్య… రామ

- Advertisement -

బతకంతా రెక్కలు ముక్కలు చేసుకుంటే పది మిగలవు
అసుంటిది నిన్ను దర్శించుకునుడే మహా భాగ్యమని
నీ కరుణకు పాత్రులమవుదామని
ఉన్నదాంట్లో జోరుగా సమర్పించుకుంటిమి
హుండీలో వేస్తే దేవుడు తీసుకుంటాడా?
దేవుడిని చేసింది మనుషులే కదా!
మా మట్టి బుర్రలకు తట్టలేదు
తప్పంతా మాదే…
ఇంటింటి నుండి ఇటుక,
ఊరూరు నుండి మట్టితో
నాణ్యత రాముడెరుగు
మందిరమైతే కన్నుల పండుగగా నిర్మాణం చేస్తిరి
ఏమైంది?
మీ ఉత్తుత్తి భక్తికి
నకార పొల్లు రామ్ అయోధ్యను ఇడిసిండు
నీతిగా బతికే ప్రజలకు రాముడు పురాణ పురుషుడే…
గుండెలనే కొలువై ఉంటడు
మధ్యల నినాదమైనోల్లకు
జాతులను విడగొట్టే తురుపు ముక్కవుతడు
మర్యాదా పురుషోత్తముడిని అమర్యాదపర్చారుగదరా…
తన ఆస్తిని తాను రక్షించు కోలేని అశక్తుడిని చేశారు
సంతర్పణల లెక్కలు దేవుడు దిగివచ్చినా తేలవు
భక్తులకు జవాబుదారిగా లేని దైవత్వం
అగ్నిహోత్రంలో బూడిదైంది
మీ పాపం పండా…
గుడి కోసం ఎన్ని కథలు
ఓడెక్కదాకనే ఓడ మల్లప్ప
దిగినంక గుడిలో లింగాన్నే కాదు గుడినే మింగుతరు
రామ్ రామ్ అంటూనే హరామ్ పనులు
రాముడి పాలనల గిట్ల జరుగలేదురా…
అసలు ఇది రాముడు పుట్టిన దేశమేనారా..!
బి. వేణుగోపాల్ రెడ్డి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -