బీజేపీ అధ్యక్షులు రామచందర్‌రావు వెల్లడి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన బిర్సాముండా జయంతిని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అధికారికంగా నిర్వహిస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్‌రావు వెల్లడించారు. అధికారంలో లేని చోట పార్టీ పెద్దఎత్తున నిర్వహిస్తున్నదని తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌లోని వివేకానంద విగ్రహం నుంచి కొమురం భీమ్ విగ్రహం వరకు బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రాంచందర్‌రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బిర్సాముండా స్మారకార్థం జనజాతీయ గౌరవ దివాస్‌గా ప్రకటించిందని తెలిపారు.
1857లో జరిగిన తిరుగుబాటును ‘భారత తొలి స్వాతంత్య్ర సమరం’గా గుర్తిస్తామన్నారు. కానీ ఆ తర్వాత కూడా ఎన్నో వర్గాలు, సమూహాలు తమ పోరాటాన్ని కొనసాగించాయని చెప్పారు. భగవాన్ బిర్సాముండా 1875లో ఝార్ఖండ్ ప్రాంతంలో జన్మించారని గుర్తు చేశారు. 1875 నుంచి 1900 వరకు ఆయన బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడారని తెలిపారు. కేవలం 25 ఏండ్ల వయసులో ఆయన జైలుల్లో మరణించారని వివరించారు. రాంజీ గోండ్, కొమురం భీమ్, అల్లూరి సీతారామరాజు వంటి గిరిజన స్వాతంత్య్ర సమరయోధులందరూ అడవుల్లో నుంచే బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడారని చెప్పారు. గిరిజన వీరులను స్మరించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ సహాయ మంత్రి సావిత్రి ఠాకూర్, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అధికారికంగా బిర్సాముండా జయంతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



