Tuesday, November 18, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రజల జీవన స్థితిగతుల అధ్యయనంపై సర్వే

ప్రజల జీవన స్థితిగతుల అధ్యయనంపై సర్వే

- Advertisement -

– గణాంక శాఖ అధికారి గుర్రం శ్రీనివాస్ గౌడ్
నవతెలంగాణ- రాయపోల్

పట్టణాలు గ్రామాలలో ప్రజల ఉపాధి జీవన స్థితిగతులపై అధ్యయనం చేయడానికి పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే నిర్వహించడం జరుగుతుందని గణాంక శాఖ అధికారి గుర్రం శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సోమవారం రాయపోల్ మండలం చిన్నమాసాన్ పల్లి గ్రామంలో పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ఎంపీడీవో జేమ్లా నాయక్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేసిన పట్టణాలు, గ్రామాలలో ప్రజల ఉపాధి జీవన స్థితిగతులపై నిర్వహిస్తున్న సర్వేలో భాగంగా రాయపోల్ మండలం చిన్న మాసాన్ పల్లి గ్రామంలో సర్వే ప్రారంభించామని తెలిపారు.తోలుత సాధారణ వివరాలతో సర్వే చేసిన అనంతరం ప్రత్యేక ట్యాబ్ ద్వారా కొన్ని కుటుంబాలను ఎంపిక చేసి మూడు నెలలకు ఒకసారి పూర్తి సర్వే చేసి వివరాలను నమోదు చేయడం జరుగుతుందన్నారు. ఈ సర్వేలో  కుటుంబ యజమాని పేరు, సభ్యుల వివరాలు, విద్యార్హతలు,వృత్తి, విద్య కోర్సులు, స్వయం ఉపాధి, నిరుద్యోగత తదితర అంశాలు నమోదు చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రాయపోల్ మండలం ఎంపీడీవో జమ్లా నాయక్, ఎంపీఓ శ్రీనివాస్, గ్రామపంచాయతీ కార్యదర్శి లావణ్య, ఫీల్డ్ అసిస్టెంట్ యాదగిరి, అంగన్వాడి టీచర్ స్వప్న, ఆశ వర్కర్ లక్ష్మి, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -