Tuesday, November 18, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఅల్లూరి జిల్లాలో ఎదురుకాల్పులు.. మావోయిస్టు అగ్రనేత హిడ్మా సహా ఆరుగురు మృతి

అల్లూరి జిల్లాలో ఎదురుకాల్పులు.. మావోయిస్టు అగ్రనేత హిడ్మా సహా ఆరుగురు మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ :ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. భద్రతా దళాల కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మరణించారు. ఆ ప్రాంతంలో ఇంకా కూంబింగ్‌ కొనసాగుతున్నదని అధికారులు వెల్లడించారు. మృతుల్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా, అతని సతీమణి హేమ ఉన్నారు. మరో అగ్రనేత ఆజాద్‌ కూడా మృతిచెందినట్లు తెలుస్తున్నది. మంగళవారం ఉదయం 6 నుంచి 7 గంటల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. హిడ్మపై రూ.కోటికిపైగా రివార్డు ఉండగా, ఆయన భార్య హేమపై రూ.50 లక్షలకుపైగా నగదు బహుతి ఉన్నది.
ఛత్తీస్‌గఢ్‌లోనూ..
మరోవైపు ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలోనూ ఎదురుకాల్పులు జరిగాయి. మంగళవారం ఉదయం ఎర్రబోరు ప్రాంతంలో మావోయిస్టులు-భద్రతా బలగాల మధ్య జరిగిన కాల్పుల్లో ఓ మావోయిస్టు మృతిచెందాడు. ఆ ప్రాంతంలో ఎదురుకాల్పులు కొనసాగుతున్నట్లు జిల్లా ఎస్పీ కిరణ్‌ చవాన్‌ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -