సీఎంఆర్ఎఫ్ పేదలకు వరం
పేదల కుటుంబాలకు పెద్దన్న పాత్ర పోషిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి
ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
నవతెలంగాణ – పాలకుర్తి
పేదల సంక్షేమం కోసమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలో గల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అర్హులైన పేదలకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులతోపాటు సీఎంఆర్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదలకు సంక్షేమ ఫలాలు అందాలంటే కాంగ్రెస్ పార్టీకి సాధ్యం అన్నారు. ప్రజా ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ప్రతి ఇంటి కి చేర్యాయని తెలిపారు. కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులతో పేదల కుటుంబాలకు సీఎం రేవంత్ రెడ్డి పెద్దన్న పాత్ర పోషిస్తున్నాడని తెలిపారు. పేదలకు సీఎంఆర్ఎఫ్ వరం లాంటిది అన్నారు. పేదలు ఆర్థికంగా నష్టపోకూడదు అనే సదుద్దేశంతో ప్రజా ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆదుకుంటుందని తెలిపారు.
గత ప్రభుత్వ హయాంలో పేదలు అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారని, మధ్య దళారీలను ఆశ్రయిస్తే తప్ప చెక్కులు చేతికందకపోయేవని తెలిపారు. పేదలను పీల్చుకుతిన్నారని ఆరోపించారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలను అందించాలని దృఢ సంకల్పంతో ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి పేదవారికి పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలను అందిస్తున్నామని, వాటికి నిదర్శనం కల్యాణ లక్ష్మి, షాది ముబారక్, సీఎంఆర్ఎఫె నని తెలిపారు. ప్రజా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేకనే ప్రతిపక్షాలు జీర్ణించుకోలేక పోతున్నాయని, దిగజారుడు విమర్శలకు పాల్పడుతన్నాయని తెలిపారు. ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టాలని కార్యకర్తలకు సూచించారు. రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



