నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : భువనగిరి జిల్లా కేంద్రంలోని రంగా చంద్రశేఖర్ ఫెర్టిలైజర్ (ప్రొప్రైటర్ రంగ ప్రవీణ్) షాపు ఆధ్వర్యంలో భువనగిరి మండలంలోని గౌస్ నగర్ గ్రామంలో
మున్నారా కంపెనీ సేల్స్ మేనేజర్ ఈశ్వర్ బయోడిఫై సాయి రెడ్డి పోసిరెడ్డి వ్యవసాయ క్షేత్రంలో రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బయోడి వలన జరిగే లాభాలను రైతులకు వివరించారు. ముఖ్యంగా పంట కోసిన తర్వాత కొయ్య కర్రలను కాల్చకుండా బయోడి ద్వారా సేంద్రీయ ఎరువులుగా మార్చవచ్చని రైతులకు సూచించారు. ఈ అవగాహన కార్యక్రమంలో జూనియర్ అగ్రనామిస్ట్ జనగాం వేణు, రంగ చంద్రశేఖర్ సేల్స్ మేనేజర్ మహమ్మద్ రాయ్యాన్, గ్రామ రైతులు ఎలిమినేటి పాపిరెడ్డి, పాక జహంగీర్ యాదవ్, బలుగూరి యాదిరెడ్డి, పడమటి అంజిరెడ్డి, భూష బోయిన నరేష్, బొక్క సత్తిరెడ్డి, భూష బోయిన నరసింహ, పాల్గొన్నారు.
రంగ చంద్రశేఖర్ ఫెర్టిలైజర్ షాప్ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



