కార్యకర్తల సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు దరాస్ సాయిలు
నవతెలంగాణ – మద్నూర్
ప్రజా ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటుదామని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దరాస్ సాయిలు నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మండల కార్యకర్తల ప్రత్యేక సమావేశాన్ని మండల కేంద్రంలోని గురు ఫంక్షన్ హాల్ లో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో అనేక రకాల సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నారని గుర్తు చేశారు. వాటిని గ్రామాల్లోని ఇంటింటికి తీసుకెళ్ళాలని కార్యకర్తలను కోరారు. ఈ సంక్షేమ పథకాలే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తాయని తెలిపారు. అందుచేత సంక్షేమ పథకాల గురించి విస్తృతంగా ప్రజలకు వివరించాలని ఈ సందర్బంగా ఆయన కార్యకర్తలను కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హనుమాన్లు స్వామి, విట్టల్ గురూజీ సలాబత్పూర్ ఆంజనేయస్వామి టెంపుల్ చైర్మన్ రామ్ పటేల్ ,మద్నూర్ సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్ పటేల్, కొండ గంగాధర్, వట్నాల రమేష్, మనోహర్ దేశాయ్, హనుమంతరావు దేశాయ్, సంఘయప్ప పార్టీ ముఖ్య నాయకులు, వివిధ గ్రామాల నుండి వచ్చిన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
స్థానిక ఎన్నికలపై మద్నూర్ లో కార్యకర్తల సమావేశం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



