- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలోని వైద్య విధాన పరిషత్ ప్రభుత్వ ఆస్పత్రిని గురువారం కార్మెల్ పాఠశాల విద్యార్థులు సందర్శించారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో అందుతున్న వైద్య చికిత్సల గురించి డాక్టర్ ఆనంద్ జాదవ్ అవగాహన కల్పించారు. ఔట్ పేషెంట్ విభాగం, ఆపరేషన్ థియేటర్, ఎక్స్ రే తదితర వార్డుల కు వెళ్లి విద్యార్థులు వివరించారు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు తప్పకుండా వైద్య సేవలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఉపాధ్యాయులు హన్మంత్ రావ్, జావీద్ విద్యార్థులు పాల్గొన్నారు.
- Advertisement -



