Thursday, November 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యార్థులు మానసిక ఒత్తిడిని జయించాలి 

విద్యార్థులు మానసిక ఒత్తిడిని జయించాలి 

- Advertisement -

• తొర్రూరు వైద్యాధికారి డాక్టర్ మానస 
నవతెలంగాణ -పెద్దవంగర
విద్యార్థులు ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, మానసిక ఒత్తిడిని జయించాలని తొర్రూరు వైద్యాధికారి, డాక్టర్ మానస అన్నారు. కేజీబీవీ పాఠశాలలోని విద్యార్థులకు పరీక్ష వేళా ఒత్తిడిని ఎలా జయించాలి, మెరుగైన ఆరోగ్యంపై గురువారం అవగాహన కల్పించారు. అనంతరం ప్రత్యేకాధికారి గంగారపు స్రవంతి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా పరీక్షలకు సిద్ధంగా కావాలన్నారు. తగినంత నిద్రపోయి మంచి ఆహారాన్ని తీసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. విద్యార్థి దశలోనే లక్ష్యాన్ని ఎంచుకొని ముందుకు వెళ్తే ప్రగతి సాధిస్తారని అన్నారు. విద్య పైనే దృష్టి కేంద్రీకరించాలని కోరారు. త్వరలోనే వార్షిక పరీక్షలు ఉన్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ మానసిక ఒత్తిడికి లోను కావద్దని తెలిపారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది అనూష, జ్యోతి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -