Thursday, November 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నిరుపేదలకు అండగా సీఎంఆర్‌ఎఫ్‌.. 

నిరుపేదలకు అండగా సీఎంఆర్‌ఎఫ్‌.. 

- Advertisement -

• మహిళ అధ్యక్షురాలు దానవత్ సునీత నాయక్ 
నవతెలంగాణ – బొమ్మలరామారం 

నిరుపేదల వైద్యం ఖర్చులకు సీఎంఆర్‌ఎఫ్‌ పథకం ఆర్థికంగా అండగా నిలుస్తుందని కాంగ్రెస్ పార్టీ మహిళా మండల అధ్యక్షురాలు దానవత్ సునీత రవీందర్ నాయక్ అన్నారు. మండలంలోని కాలకుండ్ల తండా కు చెందిన లావుడియా మానీ 27,500 రూపాయలు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కును గురువారం వారి ఇంటి వద్ద అందజేశారు. అనంతరం సునీత మాట్లాడుతూ.. అనుక్షణం పేదలకు అండగా ఉంటూ ప్రవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందిన వారికి కూడా సీఎం సహాయ అనేది నుండి ఎల్లప్పుడూ ప్రజలకు చెక్కులను అందిస్తున్న ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పేదల వైద్యానికి సీఎంఆర్‌ఎఫ్‌ పథకం భరోసా కల్పిస్తూ వారిని ఆదుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు లావుడియా శ్రీను,మాజీ ఉప సర్పంచ్ లావుడియా రమేష్ నాయక్ పలువురు నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -