నిరసన వ్యక్తం చేసిన రైతులు..
నవతెలంగాణ – తంగళ్ళపల్లి
తూకం వేసిన ధాన్యం నుండి కోత పిల్లర్లు కోతవీధించడంతో రైతులు నష్టపోతున్నారని తాడూరు రైతులు మండిపడ్డారు. రైస్ మిల్లర్లు రైతులను మోసం చేస్తున్నారని తంగళ్ళపల్లి మండలం తాడూరు వడ్ల కొనుగోలు కేంద్రం వద్ద గురువారం రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ… వడ్ల కొనుగోలు కేంద్రంలో 15 రోజుల క్రితం రైతుల వద్ద వరి ధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్లర్లకు తరలించిన తర్వాత ఇప్పుడు మిల్లర్ల యజమానులు కోతవిధిస్తున్నామని రైతులకు ఫోన్ చేస్తున్నారని రైతులు వాపోయారు. ఇలా కొనుగోలు చేసిన వరి ధాన్యం నుండి బిల్లర్లు కోత విధించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐకెపి కొనుగోలు కేంద్రంలో రైతుల వద్ద కొనుగోలు చేస్తున్న వరి ధాన్యాన్ని తూకం లో మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక బస్తా కి 42 కిలోల కు పైగా తూకం వేస్తున్నారని వాపోయారు. ఇప్పటికే రైతులు వర్షాల వల్ల ఎంతో నష్టపోయారని తెలిపారు. కోత పేరుతో రైతులను మోసం చేస్తున్న మిల్లర్ల యజమానులపై అధికారులు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు.
రైతులను మోసం చేస్తున్న మిల్లర్లు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



