నకిలీ బంగారంతో మోసాలు
అంతరాష్ట్ర నిందితుని అరెస్టు
వివరాలు వెల్లడించిన డి.ఎస్.పి
నవతెలంగాణ – మిర్యాలగూడ
సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో వివిధ ప్రాంతాలకు తిరుగుతూ అమాయక ప్రజలను టార్గెట్ చేస్తూ తక్కువ ధరకే బంగారం ఇస్తానని నమ్మబలికి నకిలీ బంగారం అంటగట్టి లక్షలు కాజేస్తున్న అంతరాష్ట్ర నిందితున్ని పోలీసులు పట్టుకున్నారు. గురువారం సాయంత్రం స్థానిక డిఎస్పీ కార్యాలయంలో డిఎస్పి రాజశేఖర్ రాజు కేసు వివరాలను వెల్లడించారు. కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారి జిల్లా కుడ్లిగి హురులికలు చెందిన గోవిందప్ప ఈ ఏడాది మే మొదటి వారంలో మిర్యాలగూడలోని నార్కెట్పల్లి అద్దంకి రహదారిపై ఓ హోటల్ వద్ద జగిత్యాల జిల్లా కోరుట్ల కు చెందిన కారపు శ్యాంసుందర్, అతని స్నేహితుడు పిడుగురాళ్ల కు పోయి తిరిగి సొంత ఊరికి వెళుతున్న క్రమంలో మిర్యాలగూడ లోని బైపాస్ రోడ్ లో హోటల్ వద్ద ఆగగా అతనితో మాటలు కలిపి ఫోన్ నెంబర్ తీసుకొని అతనికి మాయ మాటలు చెప్పి తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తానని నమ్మబలికి కర్ణాటక రాష్ట్రంలోని హౌస్ పేట దగ్గరకు బనికలకు పిలిపించి నమూనాగా బంగారకుండలో రెండు నిజమైన బంగారు బిల్లలు ఇచ్చినట్టు తెలిపారు.
మే నెల మూడో వారంలో తిరిగి మిర్యాలగూడలోని అదే హోటల్ వద్ద వచ్చిన బాధితుడిని శ్యాంసుందర్ కు నకిలీ బంగారం ఇచ్చి బెదిరించి బలవంతంగా 12 లక్షల రూపాయలు తీసుకెళ్లగా బాధితులు శ్యాంసుందర్ మిర్యాలగూడ టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తుండగా గురువారం తెల్లవారుజామున కృష్ణ పట్నం హోటల్ వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా ఉన్న గోవిందప్పను అదుపులో తీసుకొని విచారించగా నేరం ఒప్పుకున్నట్లు తెలిపారు. అతని వద్ద ఐదు లక్షల రూపాయలు నగదు, కారు, సెల్ఫోను, 200 గ్రాముల నకిలీ బంగారపు బిల్లలు స్వాధీనపరుచుకున్నట్లు తెలిపారు.
ఈ కేసులో నిందితులకు ఉన్న మహేష్, లోహిత్, నాగప్ప, ప్రసన్న గంగప్ప పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఈ కేసును ఛదించిన సిసిఎస్ ఇన్స్పెక్టర్ జితేందర్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, టూ టౌన్ సిఐ సోమ నరసయ్య, ఎస్సై రాంబాబులను అభినందించారు. మాయమాటలు చెప్పే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని ఇలాంటి మోసాలకు గురైతే పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిసిఎస్ ఎస్ఐ విజయ్ కుమార్ హెడ్ కానిస్టేబుల్ విష్ణువర్ధన్ గిరి పుష్పగిరి వెంకట్ మహేష్ సాయి రామకృష్ణ లక్ష్మయ్య రాజశేఖర్ పాల్గొన్నారు.



