Thursday, November 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బాలల హక్కుల పరిరక్షణ బాధ్యత తల్లిదండ్రులపై ఉంది ..

బాలల హక్కుల పరిరక్షణ బాధ్యత తల్లిదండ్రులపై ఉంది ..

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
బాలల హక్కులు వారి పరిరక్షణ బాధ్యత తల్లిదండ్రులు, అధికారుల పై ఉందని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మహిళా శిశు, వికలాంగుల వయో వృద్ధుల సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాలల దినోత్సవం, అంతర్జాతీయ బాలల పరిరక్షణ హక్కుల దినోత్సవ కార్యక్రమాన్ని  జ్యోతి ప్రజ్వలన తో ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్   మాట్లాడుతూ  పిల్లలు  వారి అభిలాష  ప్రకారం వారిని ముందుకు తీసుకువెళ్ళడం,  ప్రోత్సహించడం తల్లి దండ్రుల బాధ్యతని , పిల్లల హక్కులు, రక్షణ విషయాలాలో ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారుల పైన  సమాజం పైన ఉన్నదని తెలిపారు. అనంతరం పిల్లలకు బాలల దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు.

స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మాట్లాడుతూ బాలలు బంగారు భవితకు పునాదని జిల్లా సంక్షేమ శాఖ తరపున బాల్య వివాహలు ఆపి కౌన్సెలింగ్ చేస్తున్నారని అన్నారు. జిల్లా సంక్షేమ శాఖ అధికారి  నరసింహ రావు మాట్లాడుతూ.. పిల్లలు బడిలో ఉండాలి పనిలో కాదన్నారు. ఆపరేషన్ స్మైల్,ముస్ఖాన్ ద్వారా పని చేసే పిల్లలను రెస్క్యూ చేసి తిరిగి పాఠశాలలో జాయిన్ చేస్తున్నామని, వారిని పనిలో పెట్టుకున్న వ్యక్తులపై శిక్ష, జరిమానాలు విధిస్తున్నామన్నారు. పిల్లల హక్కుల గురించి పిల్లలకు,  తల్లిదండ్రులకు అవగాహన ఉండాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సి డబ్ల్యూ సి కమిటీ మెంబర్లు శివరాజ్, రుద్రమ దేవి, మల్లేశం, ఇస్తారీ,  సిడిపిఓలు శైలజ, సమీరా, బీ ఆర్ బీ కో ఆర్డినేటర్ అనంత లక్ష్మీ, జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయ సిబ్బంది, డీసీపీ యు యూనిట్, గ్రేస్ కమీషన్  గ్రేట్ కమీషన్ ఆదరణ, శాంతి నిలయం ప్రభుత్వ బాల సదనం  జీవన జ్యోతి, చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్ పిల్లలు , స్కోప్ ఎన్ జీవో సోమ నర్సయ్య లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -