Friday, November 21, 2025
E-PAPER
Homeమానవిజుట్టు రాలకుండా…

జుట్టు రాలకుండా…

- Advertisement -

చలికాలంలో చాలా మందిని జుట్టు సమస్యలు వెంటాడుతాయి. ఈ సీజన్‌లో ఉండే చలి వాతావరణం వల్ల నిర్జీవంగా మారుతుంది. అంతేకాకుండా మారుతున్న జీవనశైలి, పొల్యూషన్‌, ఆహారపు అలవాట్లు కూడా కారణమే. ఒక్కసారి జుట్టు రాలడం ప్రారంభం అయితే, దానిని ఆపడం కష్టం. ముఖ్యమైన పోషకాల్ని డైట్‌లో భాగం చేసుకుంటే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. ఆ లిస్టు ఇక్కడ చుద్దాం.

క్యారెట్‌ జ్యూస్‌ : క్యారెట్‌లో ఆరోగ్యానికి మేలు చేసే అనేక పోషకాలు ఉన్నాయి. ఆరోగ్యానికి మాత్రమే కాదు జుట్టు పోషణలో కూడా ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. క్యారెట్‌లో బీటా కెరోటిన్‌ ఎక్కువగా ఉంటుంది. ఇది జుట్టుకు పోషణ ఇచ్చి.. రాలే సమస్యను తగ్గిస్తుంది. ఇక, క్యారెట్‌ జ్యూసుతో రెట్టింపు ప్రయోజనాలు అందుతాయి. జుట్టుకు పూర్తి పోషణ అందుతుంది. దీంతో.. జుట్టు రాలడం తగ్గిపోతుంది. ఒత్తుగా, పొడుగ్గా పెరుగుతుంది.

బెర్రీస్‌ : స్ట్రాబెర్రీ, బ్లూ బెర్రీస్‌తో పాటు బెర్రీస్‌ జాతికి చెందిన పండ్లు జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి జుట్టుకు తగిన పోషణనిస్తాయి. దీంతో.. చలికాలంలో జుట్టు రాలే సమస్యను తగ్గించుకోవచ్చు.
ఆకుకూరలు : ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని మనకి తెలిసిన విషయమే. ఆకుకూరల్లో ఐరన్‌, ఫోలేట్‌, విటమిన్‌ ఎ, విటమిన్‌ సి ఉంటాయి. ఇవి జుట్టు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఆకుకూరల్లో ఆస్కార్బిక్‌ యాసిడ్‌తో పాటు ఫోలిక్‌ యాసిడ్‌, టోకోఫెరోల్‌, రైబోఫ్లావిన్‌, బీటా కెరోటిన్‌ ఉంటాయి. ఇవి జుట్టు పెరుగదలను ప్రోత్సాహిస్తాయి. బచ్చలికూర, మెంతి కూర, కొత్తిమీర, పుదీనా వంటి ఆకు కూరలు తప్పకుండా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

కోడిగుడ్డు : గుడ్డులో అనేక పోషకాలు ఉంటాయి. ప్రోటీన్లు, విటమిన్లు, సెలెనియం, ఐరన్‌ వంటి ఖనిజాలు గుడ్డులో లభిస్తాయి. ఇవి జుట్టు సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇందులో ఉండే ప్రోటీన్‌ జుట్టు రాలడాన్ని ఆపుతుంది. సెలెనియం జుట్టు పెరుగుదలను ప్రోత్సాహిస్తుంది. గుడ్డు తినడమే కాకుండా.. దీనితో హెయిర్‌ మాస్క్‌, ప్యాక్‌లు చేసుకుని అప్లై చేసుకోవచ్చు.
గింజలు : గింజల్లో ప్రోటీన్‌, జింక్‌ పుష్కలంగా ఉంటాయి. బాదం, వాల్‌నట్స్‌, గుమ్మడి గింజలు వంటి వాటిని డైట్‌లో భాగం చేసుకోవాలంటున్నారు నిపుణులు. కాపర్‌, ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్‌ అధికంగా ఉండే వాల్‌నట్స్‌ తినడం వల్ల జుట్టు తెల్ల బడకుండా ఉంటుంది.
చేపలు : ఫ్యాటీ యాసిడ్స్‌, ఒమేగా-3, విటమిన్‌ డి అధికంగా ఉండే చేపల్ని తినడం వల్ల జుట్టు రాలే సమస్యను తగ్గించుకోవచ్చని నిపుణులు అంటున్నారు. ట్యూనా, మాకేరెల్‌, సాల్మన్‌, హిల్సా వంటి చేపల్ని తినటం వల్ల జుట్టుకు తగిన పోషణ అందుతుంది. అంతేకాకుండా జుట్టు రాలే సమస్య తగ్గి.. బాగా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -