నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలనీ, ప్రభుత్వ రంగాన్ని రక్షించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 20న పనిప్రదేశాల్లో, మండల, పట్టణ, జిల్లా కేంద్రాల్లో నిరసన ప్రదర్శలు, ర్యాలీలు చేయాలని సీఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. శుక్రవారం ఈ మేరకు ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్కరాములు, పాలడుగు భాస్కర్ ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులరీత్యా ఈ నెల 20న జాతీయ కార్మిక సంఘాలు, స్వంతత్ర ఫెడరేషన్లు, అసోసియేషన్లు తలపెట్టిన సార్వత్రిక సమ్మెను జులై తొమ్మిదో తేదీకి వాయిదా వేసినట్టు తెలిపారు. 20న తలపెట్టిన నిరసన ప్రదర్శనలు, ర్యాలీలను జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు.
లేబర్ కోడ్‌ల రద్దు కోసం 20న నిరసనలు, ర్యాలీలు : సీఐటీయూ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES