Friday, November 21, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయందుబాయ్‌ ఎయిర్‌ షోలో కూలిన‌ తేజస్ ఫైట‌ర్ జెట్

దుబాయ్‌ ఎయిర్‌ షోలో కూలిన‌ తేజస్ ఫైట‌ర్ జెట్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: దుబాయ్ ఎయిర్ షోలో భారత్‌కు చెందిన తేజస్ యుద్ధ విమానం కుప్పకూలింది. ఎయిర్ షోలో భాగంగా గాలిలో విన్యాసాలు చేస్తుండ‌గా ఫైట‌ర్ జెట్ ఒక్కసారిగా కూప్ప‌కూలింది. మక్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయం పరిసన ప్రాంతాల్లో భారీ ఎత్తున మంటలు చెలరేగడంతో పాటు దట్టమైన నల్లటి పొగ కమ్ముకుంది. ఈ మంట‌ల‌ ధాటికి ఫైల‌ట్ చ‌నిపోయాడు. ఎయిర్‌ షోను వీక్షించేందుకు వచ్చిన అందరూ భయంతో పరుగులు తీశారు. అత్యవసర బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. సహాయక చర్యలు ప్రారంభించాయి. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో ఈ తేజస్ యుద్ధ విమానం తయారైన విషయం తెలిసిందే. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -