Wednesday, July 29, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఫుడ్ వాలంటీర్ జునైద్ పై పోలీసుల వేధింపులు ఆపాలి

ఫుడ్ వాలంటీర్ జునైద్ పై పోలీసుల వేధింపులు ఆపాలి

- Advertisement -
  • ఆవాజ్ తెలంగాణ రాష్ట్ర కమిటీ

నవతెలంగాణ-హైదరాబాద్: ఢిల్లీ జంతర్ మంతర్ నీట్ పేపర్ లీక్ కు వ్యతిరేకంగా జెన్ జీ యువత నిర్వహించిన ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులకు ఆహారం, మంచి నీరు అందజేయడానికి స్వేచ్చంద కార్యకర్తగా పనిచేసిన జునైదును, ఆయన కుటుంబ సభ్యులను ఉత్తరప్రదేశ్ పోలీసులు వేధించడాన్ని ఆవాజ్ తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. వేధింపులు వెంటనే ఆపాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం ఆ సంస్థ అధ్యక్షులు మహమ్మద్ జబ్బార్, ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్బాస్ పత్రిక ప్రకటన విడుదల చేశారు.

నీట్ పేపర్ లీక్ ను వ్యతిరేకిస్తూ జంతర్ మంతర్ వద్ద సుమారు 35 రోజులపాటు ఆందోళన కార్యక్రమాలు జరిగాయి. ఆ సందర్భంలో ఆందోళనకారులకి ఆహారం సరఫరా చేయడానికి ఫుడ్ వాలంటీర్ గా జునైద్ పనిచేశారు. జునైదూతో పాటు అనేకమంది ఫుడ్ వాలంటీర్లుగా పని చేసారు. విధ రాష్ట్రాల నుండి స్విగ్గి, జుమోటో లాంటి ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్ ల ద్వారా ఆర్డర్ చేయబడిన భోజనాన్ని నిరసనకారులకి అందించడంలో ఈ ఫుడ్ వాలంటీర్లు పనిచేశారు. ఫుడ్ వాలంటీర్లు తమ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని ఇదంతా చేస్తున్నట్టుగా ఎక్కడ వారు ప్రకటించలేదు. అయినప్పటికీ ప్రభుత్వం, బీజేపీ మద్దతుదారులు భోజనం ఖర్చు డబ్బులు ఎక్కడ నుండి వచ్చాయని ప్రశ్నించడం ఆందోళనకారులకు సహకరించిన వారిని వేధించాలనే ఉద్దేశంతో తప్ప మరే కారణం లేదు. జులైద్ కుటుంబానికి చెందిన వారి ఆధార్ కార్డులు, బ్యాంకు పాస్ బుక్ లు తీసుకొని వెళ్లి తనిఖీ చేయడం, అలాగే జునైద్దును వెనక్కి పిలిపించాలని బంధువులపై ఒత్తిడి చేయడం, జునైదును అక్రమంగా అరెస్ట్ చేసి కండ్లకు గంతలు కట్టి ఊరుకు దూరంగా వదిలేసి రావడం ఇవన్నీ కూడా రాజ్యాంగ విరుద్ధమైన నియంతృత్వ చర్యలు. ఆందోళనకారులకు సహకరించిన వారిని భయభ్రాంతులకు గురిచేయాలని దురుద్దేశంతో పాలకులు చేస్తున్న దుశ్చర్యలు. ఉత్తర ప్రదేశ్ పోలీసులు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియకుండా ఇది చేస్తున్నారని చెప్పి భావించలేం. అనేక రకాలుగా అక్కడికి అందుకుతున్న ఆహారాన్ని ఒక క్రమ పద్ధతిలో అందరికీ అందివ్వడం కోసం అనేక మందితో ఏర్పడిన ఫుడ్ వాలంటీర్ల బృందంలో జునేది కూడా ఒకడు. కానీ జునైద్ ను టార్గెట్ చేసుకొని వేధించడం సరైనది కాదు. జెన్ జీ ఆందోళనకారుల వలన తమ ప్రభుత్వం పేపర్ లిక్ కు బాధ్యత వహించి విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చిందనే అక్కస్సుతో
ఆందోళనకారులకు సహకరించిన జునైదును బీజేపీ ప్రభుత్వం లక్ష్యంగా చేసుకున్నట్టుగా కనిపిస్తుందని ప్రకటనలో ఆవాజ్ తెలంగాణ రాష్ట్ర కమిటీ పేర్కొంది.
ఎస్ఎఫ్ఐ నాయకురాలు ఐసీ గోష్ ను కూడా నిర్బంధించడానికి ఢిల్లీ పోలీసులు ప్రయత్నించిన విషయం వెలుగులోకి వచ్చింది. ఇలాంటి కక్ష సాధింపు చర్యలను మానుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. జెన్ జీ ఉద్యమకారులపై ప్రభుత్వ వేధింపులను ప్రజలు, ప్రజాస్వామిక వాదులందరూ తీవ్రంగా ఖండించాలని పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -