- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : రష్యాలోని కబర్డినో-బల్కారియా ప్రాంతంలో ఘోర ప్రమాదం జరిగింది. మౌంట్ మిజిర్గి నుంచి భారీ మంచు చరియలు విరిగిపడి 33 మంది పర్వతారోహకుల బృందాన్ని కమ్మేశాయి. ఈ ఘటనలో కనీసం 11 మంది మృతి చెందగా, మరో ఆరుగురు గాయపడ్డారు. పది మంది సురక్షితంగా కిందకు చేరుకున్నారు. మరో ఆరుగురి ఆచూకీ తెలియకపోవడంతో సహాయక బృందాలు గాలింపు చేపట్టాయి. ప్రతికూల వాతావరణం, మరోసారి మంచు చరియలు విరిగిపడే ప్రమాదంతో సహాయక చర్యలకు ఆటంకాలు ఎదురవుతున్నాయి.
- Advertisement -



