Tuesday, September 8, 2026
E-PAPER
Homeతాజా వార్తలుచెన్నైలో మలేషియా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

చెన్నైలో మలేషియా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : మలేషియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో దానిని చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించారు. మొత్తం 186 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఈ విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో అధికారులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. సోమవారం కౌలాలంపూర్ నుంచి జెడ్డాకు బయలుదేరిన MH156 విమానం గగనతలంలో ఉండగా, దాని ఇంజిన్ నంబర్-2లో సాంకేతిక సమస్య ఉన్నట్లు పైలట్లు గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది, విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేసేందుకు చెన్నై విమానాశ్రయ అధికారుల అనుమతి కోరారు. సమాచారం అందుకున్న వెంటనే విమానాశ్రయంలో ‘ఫుల్ ఎమర్జెన్సీ’ ప్రకటించి, సహాయక బృందాలను సిద్ధం చేశారు. విమానం సురక్షితంగా ల్యాండ్ అయిన తర్వాత, సాంకేతిక బృందాలు దానిని పరిశీలించాయి. తనిఖీల అనంతరం తదుపరి ప్రయాణంపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -