Tuesday, September 8, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం‌బాధ్యతగా ప్రజాసేవ చేస్తా

‌బాధ్యతగా ప్రజాసేవ చేస్తా

- Advertisement -


ఇది బీసీ మహిళలకు లభించిన గౌరవం :
 రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌‌చైర్‌‌పర్సన్‌ గద్వాల్‌ విజయలక్ష్మి
ప్రజాభవన్‌‌లో బాధ్యతల స్వీకరణ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

‌రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్‌‌పర్సన్‌‌గా గద్వాల్‌ ‌విజయలక్ష్మి సోమవారం హైదరాబాద్‌‌లోని ప్రజాభవన్‌‌లో పదవీ బాధ్యతలను స్వీకరించారు. అనంతరం ఆమె సీఎం ప్రజావాణి హాల్‌‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉమ్మడి ఏపీలో, తెలంగాణలో ఇప్పటి వరకు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌‌ చైర్‌‌పర్సన్‌ ‌పదవిని మహిళకు ఇవ్వలేదని చెప్పారు. తొలిసారిగా మహిళకు బాధ్యత అప్పగించడం చారిత్రాత్మక నిర్ణయమని అన్నారు. ఇది రాష్ట్రంలోని మహిళలకు, ముఖ్యంగా బీసీ మహిళలకు లభించిన గుర్తింపు అని చెప్పారు. పరిపాలనలో నిర్ణయాలు తీసుకునే స్థాయిలోనూ మహిళలకు మరిన్ని అవకాశాలు రావాలనే బలమైన సందేశాన్ని ఈ నియామకం ఇస్తోందన్నారు. మూడు కీలకమైన పదవుల్లో బీసీ మహిళలకు అవకాశం కల్పించడం మహిళా సాధికారతకు, సామాజిక న్యాయానికి కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం, సీఎం రేవంత్‌‌రెడ్డి ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనమని అన్నారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని చెప్పారు. తెలంగాణ సమగ్రాభివృద్ధికి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించేందుకు తన వంతు కృషి చేస్తానని అన్నారు. ఈ పదవిని గౌరవంగా కాకుండా బాధ్యతగా భావించి ప్రజలకు అంకితభావంతో సేవ చేస్తానని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారులు కె కేశవరావు, వి హనుమంతరావు, మహమ్మద్‌ అలీ షబ్బీర్‌, విప్‌ ‌బల్మూరి వెంకట్‌, ఎమ్మెల్సీ బి దయానంద్‌, కాంగ్రెస్‌ ‌నాయకులు రోహిన్‌‌రెడ్డి, మధుయాష్కీగౌడ్‌, ఎంపీలు రేణుకా చౌదరి, అనిల్‌‌కుమార్‌ ‌యాదవ్‌తోపాటు ప్రణాళికా శాఖ కార్యదర్శి గౌరవ్‌ ఉప్పల్‌, ప్రజావాణి స్టేట్‌ ‌నోడల్‌ అధికారి కె విద్యాసాగర్‌, వివిధ కార్పొరేషన్ల చైర్మెన్లు, కాంగ్రెస్‌ ‌నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -