Tuesday, September 8, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఆధ్యాత్మిక క్షేత్రంగా ‘ధర్మపురి’ అభివృద్ధి

ఆధ్యాత్మిక క్షేత్రంగా ‘ధర్మపురి’ అభివృద్ధి

- Advertisement -

శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి లక్ష్మణ్
దక్షిణ కాశీ ధర్మపురి పుణ్యక్షేత్రానికి సరికొత్త శోభ
అదనంగా మరో రూ. 80 కోట్లు మంజూరు
న‌వ‌తెలంగాణ – క‌రీంన‌గ‌ర్ ప్రాంతీయ 
ప్ర‌‌తినిధి / ధ‌ర్మపురి

దక్షిణ కాశీగా, ప్రముఖ క్షేత్రంగా విరాజిల్లుతున్న జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం సరికొత్త శోభను సంతరించుకోనుంది. రూ. 200 కోట్ల భారీ అంచనా వ్యయంతో ధర్మపురి క్షేత్రాన్ని అంతర్జాతీయ స్థాయి ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దే కార్యానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సోమవారం వేకువజామున 2:58 గంటలకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ భూమిపూజ చేసి, తొలుత రూ.10కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆలయం లోని ఉగ్ర లక్ష్మీనరసింహస్వామి, యోగానంద లక్ష్మీనరసింహస్వామి ఆల‌యా ల‌ను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మాది చేతల ప్రభుత్వం: 
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
‘మనందరికీ ఇష్టదైవమైన ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయాభివృద్ధిపై గతంలో చాలామంది మాటలు చెప్పారే తప్ప అర్ధరూపాయి ఇవ్వలేదు. కానీ ప్రజా ప్రభుత్వం రూ.117 కోట్లను ముందే మంజూరు చేసింది’ అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యాల కోసం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అదనంగా నిధులు కోరగా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు మరో రూ. 80 కోట్లను మంజూరు చేశామని భట్టి వివరించారు.
మొత్తంగా రూ.200 కోట్ల అంచనాతో ధర్మపురి క్షేత్రాన్ని అంతర్జాతీయ స్థాయి పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దబోతున్నామని తెలిపారు. బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి పుష్కరాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లూ సాగుతున్నాయని, పుష్కరాల్లో భాగంగా గోదావరి నది ప్రవాహం వెంట ఉన్న ఆలయాలన్నింటినీ సమగ్రంగా అభివృద్ధి చేస్తున్నామని వెల్ల‌డించారు.

రూ.200 కోట్లతో చేపట్టిన ప్రధాన అభివృద్ధి పనుల వివరాలు
ఉగ్ర లక్ష్మీనరసింహస్వామి దేవాలయ పునర్నిర్మాణం: రూ. 10 కోట్లు
9 ర‌కాల మౌలిక వసతులు, ఆలయాభివృద్ధి పనులు: రూ. 58.55 కోట్లు
గోదావ‌రి పుష్క‌రాల ఘాట్ల నిర్మాణం: రూ. 22.16కోట్లు
తిమ్మా‌పూర్ వ‌ద్ద విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మా‌ణం : రూ. 2.48 కోట్లు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -