కార్మిక సంఘాల సమావేశంలో మంత్రులు పొన్నం, వివేక్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఆటో డ్రైవర్లు, ఆటో కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ,కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకట్ స్వామి తెలిపారు. ఆటో కార్మిక సంఘాల ప్రతినిధులతో సోమవారం సచివాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటుపై కేబినెట్ లో చర్చించి శాసనసభలో బిల్లు ప్రవేశ పెడతామని తెలిపారు. ఆటో కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని చెప్పారు. ఆటో ఛార్జీల పెంపునకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని తెలిపారు. కమిటీ నివేదిక ఆధారంగా త్వరలో ఛార్జీల పెంపు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. లాస్ట్ మైల్ కనెక్టివిటీలో భాగంగా ఆర్టీసీ ఈవీ ఆటోలు నడిపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇలాంటి దుష్ప్రచారాన్ని నమ్మొద్దని సూచించారు.ఓలా, ఉబెర్ తరహాలో ప్రభుత్వమే యాప్ ప్రవేశ పెట్టడానికి ఐటీ శాఖతో సంప్రదింపులు జరిపినట్టు తెలిపారు. హైదరాబాద్‌లో 18,700 ఆటోలకు రెట్రోఫిట్‌మెంట్ కోసం రూ. 1.50లక్షల చొప్పున ఆర్థిక సహాయం చేయనున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి, కార్మిక శాఖ కార్యదర్శి దాసరి హరిచందన, అడిషనల్ కమిషనర్ రమేష్, జేటీసీలు చంద్రశేఖర్‌గౌడ్, కార్మిక శాఖ అధికారులు, ఆటో కార్మిక సంఘాల నేతలు పాల్గొన్నారు.
ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు కోసం అసెంబ్లీలో బిల్లు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



