Tuesday, September 8, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం‌బీజేపీ మనువాద పార్టీ

‌బీజేపీ మనువాద పార్టీ

- Advertisement -


తాతా మధుపై అట్రాసిటీ కేసు పెట్టాలి : అసెంబ్లీలో మంత్రి పొన్నం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

‌బీజేపీ మనువాద పార్టీ, ఫ్యూడల్‌ ‌భావాలున్న పార్టీ అని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌విమర్శించారు. సోమవారం అసెంబ్లీలో స్పీకర్‌ ‌గడ్డం ప్రసాద్‌‌కుమార్‌‌పై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలపై చర్చ జరిగింది. ఈ సమయంలో మంత్రి పొన్నం మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీలో దళిత ఎమ్మెల్యేలు ఎవరూ లేరని అన్నారు. కాంగ్రెస్‌ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గేను బీజేపీ అవమానించిందని చెప్పారు. రాష్ట్రంలో స్పీకర్‌‌ను అవమానించేలా బీఆర్‌ఎస్‌ ‌సభ్యులు మాట్లాడినా బీజేపీ సభ్యులు స్పందించడం లేదని అన్నారు. వీడియోలు పరిశీలించి ఆ సభ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ ‌చేశారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ ‌మధ్య లోపాయికారీ ఒప్పందం కుదిరించిందని చెప్పారు. అందుకే అసెంబ్లీ బయట బీఆర్‌ఎస్‌, లోపల బీజేపీ నిరసన చేపట్టాయని గుర్తు చేశారు.
బీజేపీ దళిత వ్యతిరేక పార్టీ : కవ్వంపల్లి
బీజేపీ దళిత వ్యతిరేక పార్టీ అని కాంగ్రెస్‌ ‌సభ్యుడు కవ్వంపల్లి సత్యనారాయణ విమర్శించారు. దళితులపై దాడులు చేసి చంపిన పార్టీ అని అన్నారు. హత్రాస్‌, ఉన్నావ్‌ ‌ఘటనలే అందుకు నిదర్శనమని చెప్పారు. దొరలను తరిమికొట్టి ఇక్కడి వరకు వచ్చామన్నారు. దళిత ఐఏఎస్‌, ఐపీఎస్‌‌లు అవమానాలు జరుగుతున్నాయనీ, ఇప్పుడు దళిత స్పీకర్‌‌కు, ఎమ్మెల్యేలకు అవమానమని అన్నారు. ఇంకా ఎంత కాలం ఈ అవమానాలు ఎదుర్కోవాలని ప్రశ్నించారు. స్పీకర్‌‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన తాతా మధుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ ‌చేశారు.
నేడు కేసీఆర్‌ ‌ఫాంహౌజ్‌ ‌వద్ద చావు డప్పు : వేముల వీరేశం
పథకం ప్రకారమే స్పీకర్‌ ‌ప్రసాద్‌‌కుమార్‌‌ను అవమానించారని కాంగ్రెస్‌ ‌సభ్యుడు వేముల వీరేశం అన్నారు. మంగళవారం వేలాది చావు డప్పులను కేసీఆర్‌ ‌ఫౌంహౌజ్‌ ‌ముందు కొడతామని చెప్పారు. బీఆర్‌ఎస్‌ ‌దళిత వ్యతిరేక పార్టీ, దళిత ద్రోహుల పార్టీ అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -