Tuesday, September 8, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంలైంగిక దాడికి పాల్పడిన నిందితుడిపై 
కఠిన చర్యలు తీసుకోవాలి

లైంగిక దాడికి పాల్పడిన నిందితుడిపై 
కఠిన చర్యలు తీసుకోవాలి

- Advertisement -

తెలంగాణ శ్రామిక మహిళా సమన్వయ కమిటీ( సీఐటీయూ) డిమాండ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రయివేట్ సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్న మహిళలను బెదిరించి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి రమేష్‌పై వెంటనే కేసు నమోదు చేసి చట్ట పరమైన చర్య తీసుకోవాలని తెలంగాణ శ్రామిక మహిళ సమన్వయ కమిటీ( సీఐటీయూ) డిమాండ్‌ ‌చేసింది. ఈ మేరకు సమన్వయ కమిటీ కన్వీనర్‌ ఎస్వీ రమ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.మహిళా సెక్యూరిటీ గార్డులను బెదిరించి, వారి కుటుంబ సభ్యులకు విషయం చెబుతానంటూ భయపెట్టి లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన ఆందోళనకరమని తెలిపారు. బాధిత మహిళలకు పూర్తి రక్షణ కల్పించి, నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రజలకు రక్షణ కల్పించాల్సిన సెక్యూరిటీ సిబ్బందికే రక్షణ లేకపోవడం ఆందోళనకరమని తెలిపారు. మహిళా సెక్యూరిటీ గార్డులు విధులు నిర్వహించే ప్రదేశాల్లో వారి భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. లైంగిక వేధింపులు జరగకుండా తగిన పర్యవేక్షణ వ్యవస్థ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. మహిళలపై లైంగిక వేధింపులు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోకపోతే ఇలాంటి ఘటనలు పునరావృతమయ్యే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. బాధిత మహిళకు పూర్తి రక్షణ కల్పించాలని డిమాండ్‌ ‌చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -