గవర్నర్, సీఎం స్వాగతం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము హైదరాబాద్ చేరుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ఆమెకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన, హైదరాబాద్ సీపీ సజ్జనార్ తదితరులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. అనంతరం ఆమె రాజ్‌భవన్ చేరుకుని అక్కడే లంచ్ అనంతరం కొద్ది సేపు విశ్రాంతి తీసుకున్నారు. అక్కడ్నుంచి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం చేరుకుని అక్కడ భారతీయ కళా మహౌత్సవాన్ని ప్రారంభించారు. కార్యక్రమం అనంతరం ఆమె తిరిగి రాజ్‌భవన్ చేరుకుని అక్కడే రాత్రికి బస చేయనున్నారు. శనివారం ఉదయం అక్కడే అల్పాహారాన్ని తీసుకుని ఆమె ఉదయం 9.30 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి పుట్టపర్తికి వెళ్లనున్నారు.



