– సోషల్ మీడియాలో పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు దృష్టి పెట్టాలి : రాష్ట్ర చైల్డ్ కమిషన్ చైర్‌పర్సన్ సీతాదయాకర్‌రెడ్డి
నవతెలంగాణ- ఆదిలాబాద్‌టౌన్
పిల్లల రక్షణ, భద్రత, విద్య, ఆరోగ్యం, సంక్షేమ కార్యక్రమాల అమలులో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరముందని రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్‌పర్సన్ సీతాదయాకర్‌రెడ్డి తెలిపారు. ఆదిలాబాద్ కలెక్టరేట్ సమావేశ మంది రంలో శుక్రవారం ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల బాలల భద్రత, బాల్య వివాహాల నియంత్రణ, పోక్సో చట్టం అమలు, చైల్డ్ ప్రొటెక్షన్ వ్యవస్థపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషన్ చైర్‌పర్సన్ మాట్లా డుతూ.. పిల్లలకు రక్షణ, విద్య, ఆరోగ్యం, గౌరవంతో జీవించే హక్కులు ఉన్నాయని, ఈ హక్కులను కాపాడటానికి ప్రభుత్వం మాత్రమే కాకుండా సమాజం మొత్తం బాధ్యతగా ఉండాలని చెప్పారు. ఇంకా బాల్య వివాహాలు నమోదవడం ఆందోళనకరమని, సమాచారం వచ్చిన వెంటనే తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదే శించారు. గ్రామస్థాయిలో పర్యవేక్షణ బలోపేతం చేయాలని, బాల్య వివాహ నిరోధక చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని చెప్పారు. హాస్టళ్లు, ఆశ్రమాలు, పాఠశాలల్లో పిల్లలపై వేధింపులు, నిర్లక్ష్యంపై జీరో టాలరెన్స్ విధానంతో వ్యవహరిం చాలని సూచించారు. స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా వినియోగం పెరిగిన నేపథ్యంలో పిల్లలు సైబర్ మోసాలు, అనారోగ్యకర ఆన్‌లైన్ గేమ్స్ ప్రభావానికి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లల ప్రవర్తనను గమనించాలని, వారు ఏ యాప్స్ వాడు తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు అనే అంశా లపై దృష్టి పెట్టాలని సూచించారు. బాలల అత్య వసర సమస్యల పరిష్కారానికి చైల్డ్‌లైన్ 1098 సేవలను ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. పోక్సో చట్టం అమలు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, సీపీఎస్ బలోపేతంపై అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ.. ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ ద్వారా ఇప్పటి వరకు మొత్తం 354మంది చిన్నారులను గుర్తించి, డ్రాప్ అవుట్ పిల్లలను బడిలో చేర్పించే చర్యలు చేపట్టి నట్టు తెలిపారు. షీ టీమ్, భరోసా సెంటర్, ఆరోగ్య పాఠశాల కార్యక్రమం ద్వారా కళాబృందాల సాయం తో అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామ న్నారు. నిర్మల్ జిల్లా స్థానిక సంస్థల అదనపు కల ెక్టర్, ఇన్‌చార్జి జిల్లా సంక్షేమాధికారి పైజాన్ అహ్మద్ మాట్లాడుతూ.. జిల్లాలో 2023 నుంచి ఇప్పటి వరకు 44 బాల్య వివాహ కేసులు నమోదు చేశా మన్నారు. 120 పోక్సో కేసుల్లో పరిహారం అందిం చినట్టు తెలిపారు. సమావేశంలో కమిషన్ సభ్యులు వందనగౌడ్, అపర్ణ, సరిత, ప్రేమలత, వచన్ కుమార్, ఆదిలాబాద్, నిర్మల్ ఏఎస్పీలు సురేందర్ రావు, అవినాష్ కుమార్, జిల్లా సంక్షేమ అధికారి మిల్కా, డీఎంఅండ్‌హెచ్‌ఓ రాథోడ్ నరేందర్, నిర్మల్ డీఈఓ భోజన్న, ప్రోగ్రాం కోర్డినేటర్ డా. సౌమ్య, విద్యా, సంక్షేమ, వైద్యారోగ్య, పోలీస్‌శాఖల అధికారులు, సీడబ్ల్యూసీ సభ్యులు పాల్గొన్నారు.
పిల్లల హక్కుల పరిరక్షణ ప్రతిఒక్కరి బాధ్యత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



