Saturday, November 22, 2025
E-PAPER

ప్చ్‌..

- Advertisement -

ట్రంప్‌ టారిఫ్‌లు అనుకున్నంత పని చేయలేదు..: అమెరికా సీబీఓ

వాషింగ్టన్‌: విదేశాల నుంచి అమెరికాకు దిగుమతి అవుతోన్న వస్తువులపై అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ విధించిన టారిఫ్‌లు అనుకున్నంత పని చేయలేదని కాంగ్రెషనల్‌ బడ్జెట్‌ ఆఫీస్‌ (సీబీఓ) వెల్లడించింది. ఈ సుంకాలతో వాణిజ్య లోటు నాలుగు ట్రిలియన్‌ డాలర్లు తగ్గుతుందని తొలుత అంచనా వేసింది. కానీ వాస్తవంగా మూడు ట్రిలియన్‌ డాలర్ల మేర తగ్గే అవకాశం ఉందని వెల్లడించింది.జనవరి నుంచి నవంబర్‌ మధ్య ట్రంప్‌ విధించిన సుంకాల ప్రభావం ఆధారంగా సీబీఓ గణాంకాలు వెల్లడించింది. 11 సంవత్సరాల్లో ప్రాథమిక లోటు 2.5 ట్రిలియన్‌ డాలర్లు తగ్గుతుందని, ఫలితంగా ప్రభుత్వ ఖర్చులు 500 బిలియన్‌ డాలర్లు తగ్గుతాయని పేర్కొంది. అయితే ఆగస్టు అంచనాల కంటే ఇది తక్కువ కావడం గమనార్హం.

అప్పుడవి వరుసగా 3.3 ట్రిలియన్‌ డాలర్లు, 700 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. కొత్త డేటా ఆధారంగా తన అంచనాలను సవరించింది. ట్రంప్‌ అధికారంలోకి వచ్చిన దగ్గరినుంచి శత్రువు, మిత్రుడు అని తేడా లేకుండా టారిఫ్‌లతో బెదిరించారు. తన దేశ ఉత్పత్తులకు విదేశాల్లో మార్కెట్లను విస్తతం చేసుకునేందుకు, వాణిజ్య లోటును తగ్గించుకు నేందుకు, ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ఈ టారిఫ్‌లను ఆయుధంగా వాడుతున్నారు. రెండు దేశాల మధ్య యుద్ధాలు ఆపేందుకు సుంకాలతోనే బెదిరించానని పలుమార్లు ప్రకటించుకున్నారు. సుంకాలు అమెరికా ఖజానాకు ఊహించని లాభాలు తెచ్చిపెట్టాయని ట్రంప్‌ యంత్రాంగం గొప్పలు చెప్తోంది. అయితే విమర్శకులు మాత్రం భిన్నమైన వాదనలు వినిపిస్తున్నారు. దిగుమతి అవుతోన్న వస్తువుల ధరల మోతతో వినియోగదారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని వాదిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -