జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారి సురేందర్
నవతెలంగాణ – మద్నూర్
రాష్ట్రంలో మహిళల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం అనేక రకాలుగా సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారి సురేందర్ తెలిపారు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా మద్నూర్, డోంగ్లి, మండల కేంద్రాల్లో ఐకెపి మహిళా సంఘాల సభ్యులకు చీరలను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారి సురేందర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని రంగాల్లో మహిళలు ముందు ఉంటున్నారని అన్నారు. సోలార్ ప్లాంట్లు, పెట్రోల్ బంకులు మొదలగు ఆదాయ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి రాష్ట్రంలో మంచి పేరును సంపాదించుకుంటున్నారని తెలిపారు.
వారికి ఒక డ్రెస్ కోడ్ లాగా ఇందిరమ్మ చీరలను పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. మహిళా సంఘంలో ఉన్న సభ్యులకే కాకుండా మహిళా సంఘం లో లేని వారికి 18 సంవత్సరాల నిండిన తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి మహిళకు ఇందిరమ్మ చీరను పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మద్నూర్ మండల తాసిల్దార్ ఎండి ముజీబ్, మద్నూర్ మండల ఎంపీడీవో రాణి, డోంగ్లి మండల తాసిల్దారు శరత్, మద్నూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాయిలు, డోంగ్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గజానంద్ దేశాయ్ , మద్నూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పరమేష్ పటేల్, మండల ప్రజా ప్రతినిధులు, ఇరు మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్నూర్ మండల ఐకెపి మహిళా సంఘం నాయకులు డోంగ్లి గ్రామ సంఘం నుండి వచ్చిన మహిళలు ఐకెపి ఏపీఎం జగదీష్ కుమార్, ఐకెపి సీసీలు, వివో ఏ మహిళలు ఐకెపి సిబ్బంది పాల్గొన్నారు.



