– హుస్నాబాద్ ఎస్ ఐ పాకాల లక్ష్మారెడ్డి
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని , సీసీ కెమెరాలు ఏర్పాటుకు ప్రజలు ముందుకు రావాలని హుస్నాబాద్ ఎస్ఐ లక్ష్మారెడ్డి అన్నారు. శనివారం హుస్నాబాద్ మండలంలోని గ్రామంలో సీసీ కెమెరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్సై లక్ష్మారెడ్డి మాట్లాడుతూ నేరాల అదుపునకు ప్రజల భాగస్వామ్యం అత్యంత అవసరమని తెలిపారు. కూచనపల్లి గ్రామంలో 7 సీసీ కెమెరాల ఏర్పాటుకు గ్రామస్థులు స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానంగా పనిచేస్తుందని వివరించారు.
దొంగతనాలు జరిగినప్పుడు సీసీ కెమెరాలు ఉంటే, నిందితులను గుర్తించి కేసు ఛేదించడానికి చాలా తక్కువ సమయంలో సాధ్యమవుతుందని చెప్పారు. ప్రతి గ్రామంలోనూ నేరాలు లేని వాతావరణం కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడానికి ప్రజలు చొరవ తీసుకోవాలన కోరారు.



